telugu navyamedia
రాజకీయ వార్తలు

అబూదాబి : .. సౌదీ తో భారీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న.. పుతిన్..

russia huge investments in soudi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంతో దాదాపు 130 కోట్ల డాలర్లకు పైగా విలువైన 20కి పైగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సౌదీ అరేబియాలో పర్యటించిన పుతిన్‌ రియాద్‌లో భారీ చమురు ఒప్పందం కుదుర్చుకున్న మరునాడే మంగళవారం నాడు అబూదాబీ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌తో భేటీ అయి 10 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇందులో పెట్టుబడుల భాగస్వామ్య ఒప్పందం కూడా వుండటం విశేషం.

శాస్త్ర, సాంకేతిక రంఆలు, ఆరోగ్యం, లాజిస్టిక్స్‌, పారిశ్రామికొత్పత్తుల వంటి రంగాలలో దాదాపు 13 కోట్ల డాలర్ల విలువైన 10 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రష్యా పెట్టుబడుల బోర్డు (ఆర్‌డిఐఎఫ్‌) ఒక ప్రకటనలో వివరించింది. గత ఆరేళ్లు ఇరుదేశాల మధ్య కొనసాగిన ఆర్థిక సహకారంలో దాదాపు 20,000 కోట్ల డాలర్లకు పైగా విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదముద్ర లభించినట్లు ఈ ప్రకటనలో వివరించింది.

Related posts