telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాలిని పాండే తీరుతో తల పట్టుకుంటున్న స్టార్ నిర్మాత

Shalini-Pandey

“అర్జున్ రెడ్డి” చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ షాలిని పాండే. ఈ ముద్దుగుమ్మ “అర్జున్ రెడ్డి”లో లిప్‌లాక్స్ చేయ‌డానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోయినా… ఎందుక‌నో షాలినికి అవ‌కాశాలు మాత్రం ప‌రిమితంగానే వ‌చ్చాయి. “118”లో సినిమాలో న‌టించింది. త‌ర్వాత “య‌న్‌.టి.ఆర్” బ‌యోపిక్‌లో చిన్న‌పాటి పాత్ర‌లో న‌టించింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ బిజీ అవుతోంది. 100% లవ్ తమిళ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న “సైలెన్స్” సినిమాలో ఓ కీలకపాత్రలో మెరవనుంది. ప్ర‌స్తుతం దిల్‌రాజు నిర్మాణంలో రాజ్‌త‌రుణ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం “ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం” సినిమాలోనూ న‌టిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ స‌మ‌యంలో షాలినికి ఓ బాలీవుడ్ సినిమా అవ‌కాశం వ‌చ్చింది. దీని వ‌ల్ల దిల్‌రాజు బ్యాన‌ర్ సినిమాను ప‌క్క‌న పెడుతుందని, షాలిని ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల సినిమా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అమ్మ‌డు ప్ర‌వ‌ర్త‌న చూసిన కొంద‌రు.. హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్‌పై షాలిని చిన్న‌చూపు చూడ‌టం స‌రికాద‌ని అంటున్నారు.

Related posts