telugu navyamedia
culture Telugu Poetry

రుబాయిలు

brathuku chitram poetry corner
కన్నీళ్ళను దాటుకుంటూ సంసారాన్ని మోస్తాను
కడలి కెరటాకోసం ఆదర్శంగా తీసుకుంటాను
కన్నీరే జీవితాన్ని స్వాంతనపరిచేది ఎప్పుడూ
బాధల బరువులతోనే బతుకును సాగిస్తాను
కష్టసుఖాలుంటేనే జీవితాన బతుకంటే
అలజడులుంటేనే ఆటుపోట్ల కడలంటే
చీకటివెలుతురులే జీవితంలో ఎప్పుడూ
కలిమిలేములుంటేనే బతుకు సాగడమంటే
జాబిల్లిన్నడుగుతాను చలువపందిరేయమని
సూర్యుడిన్నడుగుతాను వెచ్చనికౌగిలీయమని
రాత్రిపగలు జోడుగుర్రాలే కాలానికి ఎప్పుడూ
సాగరాన్నడుగుతాను తీరానికి చేర్చమని
ఎన్నెన్నో ముసుగులు కనపడని మనిషిలో
ఎన్నెన్నో ముసురులు అలుముకున్న చీకటిలో
కుట్రలుకుతంత్రాలే బతుకుదారిలో ఎప్పుడూ
ఎన్నెన్నో మాయలు కనిపించని గమనంలో
కనిపించని మానవతను కాగడాతో వెతుకుతాను
అగుపించని సమానతను దివిటితో పహారాకాస్తాను
సమతమమతలే మానవాళికి ఆదర్శం ఎప్పుడూ
అడుగడుగున దానవతను కలంతో తరుముతాను

Related posts

పెళ్లి విందు రద్దు చేసి.. అమరుల కుటుంబాలకు విరాళంగా.. పుల్వామా ఘటన.. 

ashok

ఆ విషయాలు మాట్లాడుకోడానికే.. యువత సగం సమయం వెచ్చిస్తున్నారట.. !

vimala p

టీవీ9 రవిప్రకాష్‌ ఇంట్లో సోదాలు!

vimala p