telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

ashwathama reddy

తెలంగాణలో 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను ఎట్టకేలకు విరమించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులంతా రేపు ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డుకోవద్దని యాజమాన్యాన్ని కోరారు. లేబర్ కోర్డులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దానిని అడ్డుకోవాలన్నారు. సమ్మె విరమించినా నైతిక విజయం కార్మికులదేనని అన్నారు. 

Related posts