telugu navyamedia
రాజకీయ

ఉన్నతాధికారులతో  ఏపీఎస్ ఆర్టీసీ యూనియన్ చర్చలు

apsrtc charges increased shortly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీ ఎస్ ఆర్టీసీ ) కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారానికి గాను ఈ నెల 13 నుంచి సమ్మెకు దిగేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.  అయితే ఈ రోజు  రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ  దాదాపు 3 గంటల పాటు  చర్చలు  జరిపింది. ఈ చర్చలు సానుకూల వాతావరణంలో ముగియడంతో సమ్మె ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 10న కార్మిక సంఘాల నేతలతో జేఏసీ చర్చించిన పిదప సమ్మెపై తుది నిర్ణయం ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ తెలిపారు. 

సమ్మె నోటీసు, ఆర్టీసీ డిమాండ్లకు అనుగుణంగానే చర్చలు జరిపామని ఆయన వెల్లడించారు. తమ డిమాండ్లు నెరవేరే దిశగానే చర్చల్లో పురోగతి కనిపించిందని అన్నారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ఎలా ఆదుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని దామోదర్ వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్ పై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు.

Related posts