telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండో రోజు ఆర్టీసీ సమ్మె.. హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌

Tsrtc increase salaries double duty employees

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఓయూ విద్యార్థి సుదేంద్ర సింగ్‌ వేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఈ సాయంత్రం 4 గంటలకు సీజే నివాసంలో పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని విస్మరించడంతో కార్మికులు సమ్మె చేస్తున్నారని విద్యార్థి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని, సమ్మె వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సుదేంద్రసింగ్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related posts