telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ .. ఆటో, క్యాబ్‌ రేట్లు పెంపు

auto driver got challan on no seat belt

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే అవకాశంగా భావించిన ప్రైవేట్ వాహన యజమానులు అడ్డగోలుగా ధరలు పెంచి ప్రయాణీకుల నుంచి అందినంత దండుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో సమ్మె కారణంగా ఆటోవాలాలు, క్యాబ్‌, రాపిడో డ్రైవర్లు ధరలు పెంచి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు.

సికింద్రాబాద్‌ నుంచి మెహిదీపట్నం వరకే ఆటో రూ.250-300, క్యాబ్‌ రూ.300-350 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు ఆటో, క్యాబ్‌లకు రెట్టింపు చార్జీలు చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇంటి నుంచి రైళ్లలో హైదరాబాద్‌ రావడం ఒక ఎత్తయితే.. రైల్వే స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన చెదుతున్నారు.

Related posts