telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విలీనంపై వెనకడుగు వేసిన.. ఆర్టీసీ సంఘాలు..

tsrtc union president aswathamareddy on kcr

దాదాపు నెలన్నరగా తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలన్న డిమాండ్ ను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయం చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ పొలిటికల్ జేఏసీ ఈ రోజు సాయంత్రం భేటీ అయింది. ఈ మేరకు వివరాలను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాకు వెల్లడించారు.

41 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు, 23 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. సమ్మె కొనసాగిస్తామంటూ.. రేపటి నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణను ప్రకటించారు. రేపు రాష్ట్రాల్లోని గ్రామాల్లో బైక్ ర్యాలీలు చేపడతామని తెలిపారు. ఎల్లుండి అన్ని డిపోలనుంచి బైక్ ర్యాలీలు, 17, 18న డిపోల ముందు సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Related posts