telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు 

rtc protest started with arrest

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీసీ డ్రైవర్ కోరేటి రాజు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటన్నాడని కూకట్‌పల్లి డిపో డ్రైవర్ రాజు ఆరోపించాడు. కార్మికుల కోసం కొట్లాడేందుకు చాలా మంది నాయకులు ఉన్నారు.

సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీల్లో జాయిన్ అయితే తమకు అభ్యంతరం లేదని.. ఇష్టమున్న వారు దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారని అందుకనుగుణంగా అందరూ విధుల్లో చేరాలని రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి మన డిమాండ్లను వినిపించడానికి రెండు మూడు రోజులు సమ్మె చేయాలి, కానీ నెలల తరబడి సమ్మె చేయడం భావ్యం కాదని తెలిపారు.

Related posts