telugu navyamedia
andhra culture news political

ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు!

apsrtc bus

లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. తాజాగా ప్రజారవాణాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ బస్సులు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రంలోని రీజనల్ మేనేజర్లకు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ సర్క్యులర్ జారీ చేశారు.

ఏపీ ఆర్టీసీ ఎండీ ఆదేశాల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తొలి దశలో 635 బస్సులను తిప్పాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను అరేంజ్ చేస్తున్నారు. బస్సుల్లో 50 శాతం మంది మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. టికెట్లను కూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు.

Related posts

గాంధీల ట్రస్టులపై ఈడీ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం

vimala p

భారత్, పాకిస్థాన్ సమరంలో..టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్

vimala p

కరోనా నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యవతి

vimala p