telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : .. అతివేగంతో .. ఆర్టీసీ బస్సు బీభ త్సం..

rtc bus accident due to over speed

ఆర్టీసీ బస్సు బాలాపూర్‌ చౌరస్తా సమీపంలో బీభ త్సం సృష్టించింది. అతివేగంతో ఉన్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ పైకి ఎక్కి..విద్యుత్‌ హైమాక్స్‌ స్తంభాలను ఢీకొట్టింది. ఒక్కసారిగా స్థానికులు, ప్రయాణికులు పరుగుతీశారు. అసలే అది ఎలక్ట్రికల్‌ బస్సు..ఎక్కడ విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అవుతుందోనని భయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. కంటోన్మెంట్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్‌ 10 యూబీ 8355) జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తుంది. అతివేగంగా వస్తుండడవల్ల బాలాపూర్‌ చౌరస్తా సమీపంలోకి రాగానే అదుపుతప్పింది. ఒక్కసారిగా డివైడర్‌పైకి ఎక్కి విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టింది. విద్యుత్‌ స్తంభం ముక్కలు అయింది.

బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు పెట్టారు. అక్కడే ఉన్న స్థానికులు, ప్రయాణికులు పరుగులుతీశారు. కాగా..పక్కన పెట్రోల్‌ బంక్‌, సినిమా హాల్స్‌ ఉన్నాయి. బస్సుకూడా ఇటీవల తయారు చేసిన ఎలక్ట్రికల్‌ బస్సు. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు క్రేన్‌ సహాయంతో బస్సును తొలగించారు.

Related posts