telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

అమెజాన్ బొంపర్ ఆఫర్.. రూ.500 లకే ప్రైమ్ మెంబర్‌షిప్

Amazon

అమెజాన్ బొంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.500 లకే లభించనుంది. కాని ఇది అందరికి కాదు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతి, యువకులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. వయస్సును నిర్ధారించుకోవడానికి మీ పాన్ కార్డును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను ప్రైమ్ డే 2019 జులై 15వ తేదీ, 16 తేదీలలో మాత్రమే అందిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఇండియా డైరెక్టర్ అక్షయ్ సిన్హా మాట్లాడుతూ యువతను అమెజాన్ ప్రైమ్‌లో సభ్యులను చేర్చుకోవాలనే లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సర చందా రూ.999తో సభ్యులుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమ వయస్సును నిర్ధారిస్తూ పాన్‌కార్డు అప్‌లోడ్ చేసిన 10 రోజుల అనంతరం అమెజాన్ పే బ్యాలన్స్‌లోకి రూ.500 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

Related posts