telugu navyamedia
telugu cinema news trending

రాజమౌళి వల్ల సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒలీవియా

Olivia

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్రఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. అయితే ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంచుకున్నాడు రాజ‌మౌళి. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ప‌లువురి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఇటీవ‌ల అమెరిక‌న్ న‌టి ఎమ్మా రోబ‌ర్ట్స్‌ని ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థానాయిక అన్నారు. కాని చివ‌రకి లండ‌న్ భామ ఒలీవియాని ఫైన‌ల్ చేశారు.

ఒలీవియా మోరిస్ థియేట‌ర్ ఆర్టిస్ట్ కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రంలో జెన్నీఫ‌ర్ పాత్ర పోషిస్తుంది. ఈమె ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు టీవీ షోస్‌లో న‌టించ‌గా, తొలిసారి ఆర్ఆర్ఆర్‌తో వెండితెర‌కి ప‌రిచ‌యం అవుతుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా జ‌త‌క‌ట్ట‌నుంద‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించిన వెంట‌నే ఎన్టీఆర్ అభిమానులు ఆమె గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. పుట్టు పూర్వ‌త్రాల‌తో స‌హా స‌మాచారం సేక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఆమె సోష‌ల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. అనౌన్స్‌మెంట్ రాక‌ముందు ట్విట్ట‌ర్‌లో ఒలీవియాకు కేవలం 300 మంది ఫాలోవర్లే ఉండేవాళ్లు. కాని ఇప్పుడు ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య 15 వేలు దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లోను ఈ రేంజ్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య పెరుగుతూ పోతుంది.

ఈ లెక్క‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే ఇండియ‌న్ సినిమా అభిమానుల ప‌వ‌ర్‌ మ‌రోసారి నిరూపిత‌మైంది. ఒలివీయాకి తెలుగు అభిమానులు గ్రాండ్ వెల్‌క‌మ్ చెబుతున్నారు. ఈ రెస్పాన్స్‌ని చూసి ఒలివీయా షాక్ అవుతూ, త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. మీ రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ టీంతో క‌లిసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను అని ఒలీవియా పేర్కొంది. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, జూలై 30, 2020న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, అలియా భట్‌, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఐర్లాండ్‌కు చెందిన రే స్టీవెన్సన్ ( పాత్ర పేరు స్కాట్‌), 53 ఏళ్ల ఐరిష్ నటి అలిసన్ డూడీ( పాత్ర పేరు లేడీ స్కాట్‌) చిత్రంలో విల‌న్స్‌గా నటించనున్నారు.

Related posts

రాశిఫలాలు : ..ఆర్థికంగా సామాన్యంగా ఉన్నా.. వేడుకలలో…

vimala p

పునర్నవి ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే ?

vimala p

“హౌజ్‌ఫుల్-4″లో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్

vimala p