telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మే 20న ఎన్టీఆర్ బర్త్ డేకి ఓసునామీలా రాబోతున్న ఎన్టీఆర్

NTR

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రౌద్రం రణం రుధిరం రూపొందుతోన్న విషయం తెలిసిందే. చారిత్రక వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తోన్నారు. ఈ మధ్యే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. అలాగే తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా.. సీతారామ రాజుగా చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకోంది. చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కూడా ఎంతో సమయం లేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. చరణ్ పరిచయానికి సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో అంతకు మించిన స్థాయిలో ఎన్టీఆర్ వీడియో ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అలాగే అభిమానుల ఆసక్తికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ ఎంట్రీ ఏ మాత్రం తగ్గకుండా.. కొమరం భీమ్‌ని ఓ సునామీలా చూపించనున్నారని టాక్. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్లు ఒలివియా మోరిస్, అలియా భట్‌లు నటిస్తున్నారు. ఈ సినిమా 2021లో జనవరి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది.

Related posts