దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30, 2020న విడుదల చేయనున్నారు. ఇటీవలే బల్గేరియాలో ఓ షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. ఆర్.ఆర్.ఆర్ సంక్షిప్త నామాన్ని విస్తరిస్తూ అనేక టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రామ రౌద్ర రుషితం అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. టైటిల్‌ను సూచించవొచ్చని కొన్ని నెలల క్రితం చిత్ర బృందం అభిమానుల్ని కోరిన విషయం తెలిసిందే. వందలాది టైటిల్స్‌ను పరిశీలించిన అనంతరం చివరకు రామ రౌద్ర రుషితం వైపు మొగ్గుచూపినట్లు వార్తలు వచ్చాయి. దసరా సందర్భంగా టైటిల్ పోస్టర్ కూడా బయటకు వచ్చింది. అయితే అది చిత్ర యూనిట్ నుంచి వచ్చింది కాదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్. అదే నిజమైన టైటిల్ అనుకుని చాలా మంది షేర్ చేశారు. అయితే అది నిజం కాదు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదని తెలుస్తోంది.
previous post