telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు ?

RRR-Press-Meet

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్రఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. ఆర్.ఆర్.ఆర్ సంక్షిప్త నామాన్ని విస్తరిస్తూ అనేక టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. మరో మూడు రోజుల్లో ఈచిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ నెల 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసి.. ఫైనల్‌గా దీపావళికి మాత్రం ఖచ్చితంగా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించి.. జనాల్లోకి ఈ పేరు తీసుకెళ్లెలా జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి లండన్‌లో ప్రదర్శితమయ్యే ‘బాహుబలి’ సినిమా కోసం అక్కడకి వెళ్లాడు. అక్కడ రాయల్ ఆల్బర్ట్ స్టేడియంలో ఈ సినిమాను మరికాసేపట్లో ప్రదర్శించనున్నారు. రాజమౌళి వెంట ప్రభాస్, రానా, అనుష్క కూడా ఉన్నారు. వారం తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే RRR సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తైయినట్టు సమాచారం.

Related posts