telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” అప్డేట్ : 40 రోజుల షూటింగ్ అక్కడే…!

RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే టీమ్ మొత్తం బ్యూటిఫుల్ సిటీ కలకత్తాకు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ సుమారు 40 రోజుల పాటు ఆకర్షణీయమైన లొకేషన్లలో సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో చరణ్, ఎన్టీఆర్ తో పాటు పలువురు కీలకపాత్రధారులకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ అయిపోగానే చిత్రబృందం హైదరాబాద్ కు వచ్చేస్తారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ల విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం “బాహుబలి” లాంటి సినిమా అవుతుందని రాజమౌళి ఇదివరకే చెప్పారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో విడుదలవుతుందని ముందుగానే ప్రకటించారు.

Related posts