telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

ఆర్ఆర్ఆర్… ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ మరికొందరు కొన్ని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను ఉద్దేశించి విడుదల చేసిన రెండు ట్రైలర్లు కూడా భారీగా ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందే చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు మరింత సందడి చేకూర్చేందుకు జక్కన్న మరో కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్నాడని అందులో బాగంగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ మరికొన్ని భాషల్లో రూపొందుతోంది.  ఇదిలా ఉంటే ఈ సినిమా మేకర్స్‌ తాజాగా సర్‌ఫ్రైజ్‌ అప్డేట్‌ ఇచ్చారు. మధ్యాహ్నం ఈ మూవీ నుంచి బిగ్గెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. దీంతో ఎన్టీఆర్‌, రాంచరణ్‌ ఫ్యాన్స్‌లో ఉత్సాహం మొదలైంది. ఇక ఆ సర్‌ఫ్రైజ్‌ ఏంటో మధ్యాహ్నం 2 గంటల వరకు ఎదురు చూడాల్సిందే. 

Related posts