telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : ఫస్ట్ లుక్ విడుదలకు టైం ఫిక్స్ ?

RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్రఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. ఆర్.ఆర్.ఆర్ సంక్షిప్త నామాన్ని విస్తరిస్తూ అనేక టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇక సినిమాలో ఎనిమిది పాటలుంటాయని వార్తలు విన్పిస్తున్నాయి. కాగా… ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏడాది పూర్తయిపోయింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఒక్క లుక్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. అటు ఎన్టీయార్ ఫ్యాన్స్, ఇటు చెర్రీ అభిమానులు తమ హీరోల ఫస్ట్‌లుక్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల ఎదురు చూపులు ఫలించబోతున్నాయట. ఇద్దరు హీరోల లుక్‌లు బయటకు రాబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన ఎన్టీయార్ ఫస్ట్‌లుక్, సంక్రాంతి సందర్భంగా చెర్రీ లుక్ బయటకు రాబోతున్నాయట. అప్పటి నుంచి రెగ్యులర్‌గా సినిమాలోని కీలక నటుల లుక్‌లన్నింటినీ విడుదల చేస్తారట. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Related posts