telugu navyamedia
telugu cinema news trending

ఆర్ ఆర్ ఆర్ కు .. జంట కష్టాలు …

rrr

రాజమౌళిని ఆర్ ఆర్ ఆర్ కష్టాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను మొదలు పెట్టిన రాజమౌళిని వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. గతంలోనే హీరోలిద్దరు గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. ఇటీవల రామ్‌చరణ్ మళ్లీ గాయపడినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు హీరోయిన్‌ను సెట్ చేయడం రాజమౌళికి పెద్ద సవాల్‌గా మారింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే రామ్‌చరణ్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్‌ను అనుకున్నారు. ఎన్టీఆర్ పక్కన విదేశీ భామ డైసీ ఎడ్గార్‌ జోన్స్ నటిస్తుందని రాజమౌళి స్వయంగా ఎనౌన్స్ చేశారు.

ఈ ప్రాజెక్ట్ నుంచి, కారణాలు ఏవైనా, జోన్స్ తప్పుకున్నారు. ఆ తర్వాత నాలుగైదు నెలల పాటు గ్యాప్ వచ్చింది. చివరకు రాజమౌళి అటు వెతికి… ఇటు వెతికి ఎన్టీఆర్‌కు జోడిగా మరో హాలీవుడ్‌ భామ ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ పాత్ర తక్కువుగా ఉండడంతోనే ఎమ్మాను సెలెక్ట్ చేశారని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయ్‌. ఇప్పుడు మళ్లీ షాక్ తగిలినట్టే తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఎమ్మా కూడా ఆర్ ఆర్ ఆర్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓ రీజినల్‌ సినిమాకు బల్క్‌ డేట్స్‌ ఇచ్చేందుకు ఎమ్మా ఆసక్తి చూపించటం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో మరోసారి రాజమౌళికి ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌ను వెతుక్కోక తప్పని పరిస్థితి. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ ఎక్కడ ఉందో.. రాజమౌళి ఆ హీరోయిన్‌ను ఎప్పటకి సెట్ చేస్తాడో ? అని ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

Related posts

భారత లక్ష్యం .. 154 పరుగులు..

vimala p

వామ్మో ! దొంగనోట్ల కోసం ఎంత పని చేస్తున్నారో..

vimala p

వరుస ప్రాజెక్టులతో .. శర్వానంద్ .. మరో గ్రీన్ సిగ్నల్..

vimala p