telugu navyamedia
news telugu cinema news trending

:ఆర్.ఆర్.ఆర్. : .. ఎప్పుడూ ఎన్టీఆర్ గురించేనా .. రామ్ చరణ్ విశేషాలు చెప్పారా..

RRR-Press-Meet

రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటేనే సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేస్తుంటే.. ఆ అంచనాలకు ఆకాశమే హద్దు అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ పై ఇదే పరిస్థితి నెలకొంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాపై వస్తున్న వార్తలతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతుంటే మెగా అభిమానులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ పులితో తలపడే భారీ ఫైట్ ను బల్గేరియాలో చిత్రీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ మూవీ 300 లో తోడేలు ఫైట్ తరహాలో ఉండేలా ఈ ఫైట్ ను భారీగా తెరకెక్కించారని సమాచారం. ఈ వార్త సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఇదే తరహాలో రామ్ చరణ్ పై ఎటువంటి హైప్ పెంచే వార్త ఇంతవరకూ బయటకు రాలేదు. ప్రతిసారీ ఎన్టీఆర్ పై షూటింగ్ అనో.. కీలక సన్నివేశమనో బయటకు రావడమే తప్ప రామ్ చరణ్ పై వార్త మాత్రం రావటం లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. భారీ మల్టీస్టారర్ అంటే తెలుగులో అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా ఫ్యాన్స్ ను మెప్పించాల్సిందే. ఈ ఈక్వేషన్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసినట్టు మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యే వార్త ఏదీ బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ పులి ఫైట్ వార్త ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. రామ్ చరణ్ పై కూడా భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయని అంటున్నారే కానీ.. ఇంతవరకూ బయటకు ఏ న్యూస్ రాలేదు. మరి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్ ఎప్పుడస్తుందో చూడాలి.

Related posts

24 గంటల్లో 642 కొత్త కేసులు..పాకిస్థాన్ లో లాక్‌డౌన్‌ పొడగింపు

vimala p

త్వరలో మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో `ఢీ2`… ?

vimala p

ఇండియాలో ఓ రోజు ముందుగానే “స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం”

vimala p