telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆలియా భట్… వాల్ పేపర్ ముద్దుసీన్… వీడియో వైరల్

Alia

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఫోన్ వాల్‌పేపర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈరోజు ఉదయం ముంబయిలో ‘గిల్టీ’ అనే వెబ్ సిరీస్ చూసేందుకు ఆలియా ఓ మల్టీప్లెక్స్ వద్దకు వచ్చింది. అయితే ఆలియాను ఫొటోలు తీస్తున్న ఫొటోగ్రాఫర్లు ఆమె ఫోన్ వాల్‌పేపర్‌ను కూడా జూమ్ చేసి మరీ ఫొటోలు క్లిక్‌మనిపించారు. వాల్‌పేపర్‌లో ఆలియా ఎవరికో ముద్దుపెడుతున్నట్లుగా కనిపించారు. ఆలియా, రణ్‌బీర్ దాదాపు ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరూ ఈ విషయాన్ని అంగీకరించడంలేదు కానీ మ్యాటర్ పెళ్లి వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ సమయంలోనే ఆలియా తన ప్రేమను రణ్‌బీర్‌ను వ్యక్తం చేసింది. రణ్‌బీర్ కూడా ఆలియాను ఇష్టపడటంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఆలియాను కోడలిగా చేసుకోవడం రణ్‌బీర్ ఇంట్లో వారికి కూడా ఇష్టమే. వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మా్స్త్ర’ సినిమా క్రిస్మస్‌కు రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వీరి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. ఆలియా రణ్‌బీర్ కంటే పదేళ్లు చిన్నది.అయితే ఫ్యాన్స్ మాత్రం రణ్‌బీర్ సోదరుడు అర్మాన్ పెళ్లి వేడుకలో తీసిన ఫొటో అని కామెంట్స్ పెడుతున్నారు. అదే పెళ్లి వేడుకలో ఆలియా, రణ్‌బీర్ కిస్ చేసుకున్నారని, ఆ ఫొటోనే ఆలియా గుర్తుగా వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారని అంటున్నారు.

Related posts