telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

RRB JE ‘స్టేజ్-2’ ఫైనల్ ‘కీ’ వచ్చేసింది… !

RRB

రైల్వేల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన స్టేజ్-2 పరీక్ష ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని రైల్వే రిక్రూమ్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతో పాటు, అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా అందుబాటులో ఉంచింది. సీబీటీ-2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ ‘కీ’ చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అక్టోబరు 12లోపు తెలపవచ్చు. రైల్వేలో మొత్తం 13,487 జేఈ, ఇతర పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 1 వరకు ఐదురోజులపాటు స్టేజ్-2 పరీక్షలు నిర్వహించింది. ప్రాథమిక కీని సెప్టెంబరు 26న విడుదల చేశారు. ఆన్సర్ కీపై సెప్టెంబరు 29 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం అక్టోబరు 10న రివైడ్జ్ ఫైనల్ కీ ని రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అక్టోబరు చివరివారంలో స్టేజ్-2 పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశమున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. స్టేజ్-2 పరీక్షలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి

Related posts