telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోజ్ వ్యాలీ కుంభకోణంలో ప్రముఖ నటికి ఈడీ నోటీసులు

Rituparna-Sengupta

రోజ్ వ్యాలీ భారీ కుంభకోణంలో ప్రముఖ బాలీవుడ్ సినీ నటి రీతుపర్ణసేన్ గుప్తాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రోజ్ వేలీ కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. బెంగాల్ లో సంచలనంగా మారిన రోజ్ వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా ఈ కుంభకోణంపై దుమారం చెలరేగింది. బెంగాల్ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మెహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని, పాతిక కోట్లు తీసుకున్నారనే ఆరోపణలతో ఆయన ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. 2010-12 మధ్యకాలంలో రోజ్ వ్యాలీ కంపనీ పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రముఖ బెంగాల్ హీరో ప్రసేన్ జిత్ ఛటర్జీ హస్తం ఉందంటూ మంగళవారం నాడు సమన్లు జారీ చేసింది. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. ప్రసేన్ జీత్ చటర్జీ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. ఈ విషయం ఇప్పుడు బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన “ఘటోత్కచుడు” సినిమాలో నటించి రీతుపర్ణ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.

Related posts