telugu navyamedia
andhra news political

లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాల్సిందే: రోజా

Nagari TDP Ticket Gali Brothers

తెలంగాణ ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి వెల్లడించిన సర్వేల పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాల్సిందే అని రోజా వ్యాఖ్యానించారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశాన్ని కాపాడుకోలేని చంద్రబాబునాయుడు దేశాన్ని ఎలా కాపాడుతారో చెప్పాలని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు తరహలోనే ఏపీ ప్రజలు కూడ తెలుగుదేశానికి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేది మీడియానే అని, చంద్రబాబు అవినీతిని ప్రజలకు మీడియా తెలియజేయాలని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల్ని కేసీఆర్‌ సాధించారని కొనియాడారు. జగన్‌ని ఆశీర్వదించిన రోజునే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. గ్రామాల్లో టీడీపీ వాళ్లు కనిపించే పరిస్థితి ఉండదని తెలిపారు. చంద్రబాబు, రేవంత్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. గ్రేటర్‌ పరిధిలోని సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి టీఆర్ఎస్‌ను ప్రజలు గెలిపించడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు.

Related posts

నకిలీ అధికారిని చెప్పుతో చితక్కొట్టిన మహిళ

vimala p

గీతం వైస్‌ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ శివరామకృష్ణ

vimala p

వైసీపీ, ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా .. నటుడు పృథ్వీరాజ్..

vimala p