telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ బౌలర్ ను ఎదుర్కోవడం రోహిత్‌ కే తెలుసు…

హైదరాబాద్ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌… ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఓపెనింగే కీలకమని పేర్కొన్నాడు. రోహిత్‌ను కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ స్లెడ్జింగ్‌ చేశాడని న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ షేన్‌ బాండ్‌ అన్నాడు. కొన్నినెలల క్రితమే వారిద్దరూ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ గురించి మాట్లాడుకోవడం అద్భుతమని బాండ్‌ చెప్పాడు. భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం డబ్ల్యూటీసీ ఫైన‌ల్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైన‌ల్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ… ‘తన ఆఫ్‌స్టంప్‌ ఎక్కడుందో తెలుసుకోవడం ప్రతి ఓపెనర్‌కు చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా సిరీసులో రోహిత్‌ శర్మ భారత జట్టుకు ఓపెనర్‌గా మారినప్పటి నుంచీ అలాగే చేస్తున్నాడు. ఆ సిరీసులో అద్భుతంగా ఆడాడు. ఆరంభంలో క్రమశిక్షణతో ఉన్నాడు. దానినే ఇంగ్లండ్‌లో పునరావృతం చేస్తే పరుగులు చేస్తాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ రూపంలో అతడికి సవాల్‌ ఎదురవుతుంది. అయితే బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎడమకాలిని అడ్డంగా పెట్టొద్దని అతడికి తెలుసు. రోహిత్.. బౌలర్‌ లేదా అంపైర్‌ వైపు బ్యాటు ఫుల్‌ ఫేస్‌తో ఆడాలి’ అని సూచించాడు. ఐపీఎల్ 2021 సమయంలో నెట్స్‌లో సాధన చేస్తుంటే రోహిత్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌ ఎలాంటి మాటలు అనుకున్నారో షేన్‌ బాండ్‌ వివరించాడు. ‘ఐపీఎల్‌ 2021లో రోహిత్‌కు నెట్స్‌లో బౌల్ట్‌ బంతులు వేస్తాడు. అందులో కొన్ని రోహిత్ ప్యాడ్లకు తగులుతాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ ఇలాగే జరుగుతుందని బౌల్ట్‌ సరదాగా అనేవాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts