telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజినీకాంత్ కు కరోనా పాజిటివ్… అభిమానులకు షాకిచ్చిన నటుడు

rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో రజినీకాంత్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు బాలీవుడ్ యాక్ట‌ర్ రోహిత్ రాయ్. త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా “కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి ప‌రీక్ష‌ల‌లో కరోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో కరోనా క్వారంటైన్‌లో ఉంది” అని కామెంట్ పెట్టాడు. దీంతో నెటిజ‌న్స్ రోహిత్‌పై మండిపడుతున్నారు. త‌మిళనాడులో ర‌జ‌నీకాంత్‌ని ఎంత‌గానో ఆరాధిస్తారు. ఇలాంటి జోకుల‌తో వారి మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌కండి అని, ఇలాంటి జోకులు భార‌తీయ సంస్కృతి కాదు, కాకూడ‌దు అని కామెంట్ చేస్తున్నారు రజినీకాంత్ అభిమానులు. ఇలా త‌న ‌పై నెటిజన్స్ ట్వీట్ల దాడి చేస్తున్న క్ర‌మంలో “గైస్‌.. ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌కండి” అంటూ మరో కామెంట్ చేశారు రోహిత్. కాబిల్‌, ప‌ల్టాన్‌, క్యాలెండ‌ర్ గార్ల్స్‌, డాన్ ముత్తు స్వామి, ఫ్యాష‌న్‌, మిట్ట‌ల్ వ‌ర్సెస్ మిట్ట‌ల్‌, ఏక్ ఖిలాడీ ఏక్ హ‌సీనా, అపార్ట్‌మెంట్ అండ్ ప్లాన్ రోహిత్ రాయ్ చిత్రాల‌లో న‌టించాడు.

Related posts