telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రెండో రోజు .. డబల్ సెంచరీ చేసిన.. రోహిత్ శర్మ ..

rohit double century in 3rd test

రాంచీ లో భారత-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతున్నది. మొదటిరోజు 224/3 గా ఉన్న ఇండియా జట్టు.. రెండో రోజు ఆటను నిలకడగా ప్రారంభించి ఆ తరువాత దూకుడును పెంచింది. రహానే సెంచరీ పూర్తి చేసిన తరువాత ఔట్ అయ్యాడు. ఆ తరువాత రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ. వంద, 150 పూర్తి చేసి.. ఆ తరువాత నెమ్మదిగా ఆడటం మొదలు పెట్టాడు.

199 పరుగులు చేసిన తరువాత రోహిత్ శర్మ తనదైన శైలిలో సిక్సర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తిచేశారు. 255 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లతో రోహిత్ డబుల్ సెంచరీ (212) పూర్తి చేయడం విశేషం. విశాఖలో జరిగిన మొదటి టెస్ట్ లో వరసగా రెండు సెంచరీలు చేసి రికార్ట్ సృష్టించాడు. మూడో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటె, గతంలో ఈ హిట్ మ్యాన్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. మూడుసార్లు డబుల్ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 255 బంతుల్లో 212 పరుగుల అనంతరం రోహిత్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 386 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంది.

Related posts