telugu navyamedia
telugu cinema news trending

ఇద్దరు కమిట్మెంట్ అడిగారు : రోహిణి

Rohini

సినీ పరిశ్రమలో లైంగిక ఒత్తిడులు ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే చాలామంది మహిళలు స్పష్టం చేశారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది నటీమణులు మీతోడూ అంటూ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. అయితే సినిమాల్లోనే కాదు సీరియల్స్ లో నటించే వాళ్లకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురవుతోందని తాజాగా బుల్లితెర నటి రోహిణి వెల్లడించింది. ఇటీవలే “బిగ్‌బాస్” నుంచి ఎలిమినేట్ అయ్యింది రోహిణి. బిగ్ బాస్ లో ఉన్నంత కాలం సరదాగా గడిపేసిన రోహిణి ఎలిమినేషన్ కోసం నామినేషన్ జరుగుతున్న సమయంలో శివజ్యోతితో గుసగుసలాడి డైరెక్టుగా నామినేషన్ కు గురైంది. అలా బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిణి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. “బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ సీరియల్ ఆడిషన్ కోసం నిర్మాతలను కలిశాను. అక్కడున్న ఇద్దరు నిర్మాతలు నన్ను కమిట్‌మెంట్ అడిగారు. ఆ తర్వాత మరో ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ వయసులో చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా నన్ను `నీకు అవకాశమిస్తే.. నాకేమిస్తావ్` అని అడిగాడు. కెరీర్ ఆరంభంలో ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాను” అంటూ రోహిణి చెప్పింది.

Related posts

ఫలితాలు … యూ ట్యూబ్ లో … లైవ్ ప్రసారం… 14 భాషల్లో..

vimala p

ఈవారం ఏపీలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”

ashok

జవాన్ల శవాలపై .. మోడీ రాజకీయ ఎత్తుగడలు..! : బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్

vimala p