telugu navyamedia
సినిమా వార్తలు

అవెంజర్స్ : అతనొక్కడికే 524 కోట్ల పారితోషికం… రికార్డులు తిరగరాస్తున్న “ఎండ్ గేమ్”

Avengers-4
ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ సునామీ సృష్టిస్తున్న అవెంజర్స్‌, ఇండియాలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. మన దేశంలో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా చరిత్ర సృష్టించిన “అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌”, తొలి వారాంతంలో రూ.158.65 కోట్లు (శుక్ర-53.60, శని-52.20, ఆది-52.85) వసూలు చేసింది. ఈ చిత్రం సోమవారం రూ. 31.05 కోట్లు, మంగళవారం సుమారు రూ. 30 కోట్లు వసూలు చేసింది. దాంతో విడుదలైన ఐదు రోజుల్లో వసూళ్ళల్లో డబుల్‌ సెంచరీ కొట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. తొలి వారంలో హిందీ హిట్‌ సినిమాలు ‘దంగల్‌’ రూ. 197.54 కోట్లు, ‘టైగర్‌ జిందా హై’ రూ. 206.04 కోట్లు, ‘సంజు’ రూ. 202.51 కోట్లు వసూలు చేశాయి. వాటిని ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఐదు రోజుల్లో దాటేసింది. ‘బాహుబలి 2’ని ఎప్పుడు దాటుతుంది? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్‌ తొలి వారంలో రూ. 247 కోట్లు వసూలు చేసింది.
ఇక మన దేశంలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ లెక్కల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోందీ సినిమా. పలు దేశాల్లో వసూళ్ళ రికార్డులను తిరగరాస్తోంది. కొన్ని దేశాల్లో బుధవారం, మరికొన్ని దేశాల్లో శుక్రవారం ఎండ్‌గేమ్‌ విడుదలైంది. ఆదివారానికి వన్‌ బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. విడుదలైన ఐదు రోజుల్లో, తొలి వారాంతంలో సుమారు 8,400 కోట్లు వసూలు చేసి, అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. త్వరలో ఈ సినిమా 10 వేల కోట్ల క్లబ్‌లో చేరుతుంది. త్వరలో ‘అవెంజర్స్‌’ సిరీ్‌సలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా తొలి స్థానంలో ఉన్న ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ రెండో స్థానంలోకి వచ్చేలాగే ఉంది. 
ఈ చిత్రానికి సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ఐరెన్ మ్యాన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు అవెంజర్స్ అన్ని సిరీస్ లలో రాబర్ట్ మెయిన్ లీడ్ లో కనిపించాడు. అయితే ఎండ్ గేమ్ కోసం రాబర్ట్ సుమారు 524 కోట్ల (75 మిలియన్ల డాలర్లు) రెమ్యునరేషన్ ని అందుకున్నాడట. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా కలెక్షన్స్ నుంచి వాటా రూపంలో ఈ భారీ ఎమౌంట్ రాబర్ట్ కి అందినట్లు తెలుస్తోంది. 

Related posts