అగ్రరాజ్యం అమెరికాలో కూడా రోడ్లు కుంగిపోతున్నాయి. తాజాగా, ఓర్లాండో ఆరెంజ్ కౌంటీలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచగా, రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డుపై అనేకచోట్ల భారీస్థాయిలో మట్టి కుంగిపోవడంతో వాహనాలు గుంతల్లో పడిపోయాయి. రోడ్డు కుంగిపోయిన చోట భారీగా నీరు పొంగిపొర్లుతోంది.
గతంలో ఈ ప్రాంతంలో సరస్సు ఉండేదని, కాలక్రమంలో అక్కడ పూడిక పేరుకుపోయి మైదానంగా మారిపోయిందని, ఇప్పుడా సరస్సుపైన ఉన్న రోడ్డే కుంగిపోయిందని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగిన వెంటనే ఆరెంజ్ కౌంటీ సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. కుంగిపోయిన వాహనాలు బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాయలసీమను రెండో రాజధాని చేయాలి.. టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు!