telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా కంటే అలా ఎక్కువ మంది మరణిస్తున్నారు…

మన దేశాన్ని కరోనా అతలాకుతల చేస్తున్న విశాతం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వైరస్ కారణంగా భారత వ్యాప్తంగా లక్ష్య యాభై వేళా మందికి పైగా మరణించారు. ఈ వైరస్ కారణంగా పలువురు రాజకీయ నేతలు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ఇలా.. అన్ని రంగాల్లోనివారు ప్రాణాలు విడిచారు. అయితే, గత ఏడాది కరోనాతో మృతిచెందినవారి కంటే.. రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారని వెల్లడించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన గడ్కరీ.. రోడ్డు ప్రమాదాల నివారణపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని చెప్పుకొచ్చారు.. ఇదే సమయంలో.. మృతుల వివరాలను కూడా వెల్లడించారు.. గత ఏడాది దేశవ్యాప్తంగా కోవిడ్ బారినపడి 1.46 లక్షల మంది మృతిచెందగా.. ఈ కాలంలోనే రోడ్డు ప్రమాదాల కారణంగా 1.5 లక్షల మంది ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు.. ఇక, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 18-35 వయస్సు వారే ఎక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం ఆందోళనతో ఉందని.. నివారణ చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు గడ్కరీ. అయితే చూడాలి మరి ఈ విషయం లో కేంద్రం ఇంకా ఏం చేస్తుంది అనేది.

Related posts