telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీసిఎల్ భూమి పూజ చేస్తూ రోజా పోస్ట్… ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు… ఎందుకంటే ?

Roja

నగరి ఎమ్మెల్యే రోజా ఫైర్ బ్రాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబు, లోకేష్ పై అయితే రాజకీయ వ్యాఖ్యలే కాకుండా బాడీ షేమింగ్ చేస్తూ హేళనగా మాట్లాడుతూ ఉంటారు. లోకేష్ ని పప్పు పప్పు అంటూ అసలు నువ్వు మంత్రిగా ఏమి చేసావ్ ? అంటూ రోజా ప్రెస్ మీట్లలో అనేక సార్లు ప్రశ్నించడం మనం చూశాము. ఈ నేపధ్యంలోనే రోజా ఈ రోజు పెట్టిన ఫేసుబుక్ పోస్ట్ చూస్తే, ఆమె లోకేష్ ని ఇన్ డైరెక్ట్ గా పొగిడినట్టు అనిపించింది అంటూ నెటిజెన్ లు కామెంట్ చేస్తున్నారు. రోజాకు ఏపీఐఐసి చైర్మెన్ పదవి ఇచ్చారు జగన్. దీని పై అనేక విధాలుగా విమర్శలు వచ్చాయి. రోజాకి పెట్టుబడులు తెచ్చే ఏపీఐఐసి చైర్మెన్ లాంటి కీలక పదవి ఎలా ఇస్తారని, ఆమె ఇన్వెస్టర్స్ తో మాట్లాడే సామర్ధ్యం లేదు అన్నది ఆ విమర్శల సారాంశం. ఈ నేపధ్యంలోనే రోజా ఈ రోజు టీసిఎల్ అనే పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేశారు. ఇది చైనాలో ఒక పెద్ద కంపెనీ. ఈ సందర్భంగా రోజా ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. “ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ TCL ఆంధ్ర ప్రదేశ్ లో 2,200 కోట్లతో తిరుపతిలో రెండు కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చింది. జగనన్న ఆశీస్సులతో APIIC ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక మొట్ట మొదటి ప్రాజెక్ట్ కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉంది” అంటూ ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

దానికి కారణం లేకపోలేదు. టీసిఎల్ అనే కంపెనీ కోసం అప్పటి ఐటి మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా స్వయంగా చైనా వెళ్లి, వారిని ఒప్పించి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా చేసారు. ఇందుకోసం తిరుపతిలో 153 ఎకరాలు కేటాయించారు. 22 వేల కోట్ల పెట్టుబడితో, 8 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, ఈ కంపెనీ ఒప్పందం కూడా చేసుకుంది. డిసెంబర్ 20, 2018లో ఈ కంపెనీ భూమి పూజ కూడా చేసారు. ఈ పూజకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. అయితే అప్పట్లోనే భూమి పూజ అయిపోయిన కంపెనీకి ఇప్పుడు మళ్ళీ రోజా భూమి పూజ చెయ్యటం, అలాగే అప్పట్లో పప్పు పప్పు అని హేళన చేసిన లోకేష్ తెచ్చిన కంపెనీని ఈ రోజు గొప్పగా చెప్తూ, మా జగనన్న ఆశీసులు అని చెప్పటం చూసి, నెటిజెన్లు రోజా పోస్ట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

Related posts