telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కళ్యాణ్ దేవ్ కు హీరోయిన్ దొరికేసింది

Riya-Chakravarthy

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ “విజేత” సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమాలో కళ్యాణ్ దేవ్ కు నటనపరంగా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కానీ లుక్స్ పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తరువాత బాగానే గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఇప్పుడు పులివాసు దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. కళ్యాణ్ దేవ్ సరసన “రియా చక్రవర్తి” హీరోయిన్ గా నటించనుంది. ఈ బ్యూటీ హిందీలో హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబి తదితర చిత్రాల్లో నటించింది. తెలుగులో “తూనీగ తూనీగ” చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్ళీ చాలా గ్యాప్ తరువాత తెలుగులో కళ్యాణ్ దేవ్ సరసన నటించబోతోంది.

ముందుగా ఈ చిత్రాన్ని సుధీర్ బాబు హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా చేయాలని అనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే మధ్యలో సుధీర్ బాబుతో భేదాభిప్రాయాలు రావడంతో సుధీర్ బాబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కు కళ్యాణ్ దేవ్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం కళ్యాణ్ దేవ్ పక్కన నటించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో హీరోయిన్ల వేట మొదలైంది.

Related posts