telugu navyamedia
telugu cinema news

మహారాష్ట్ర వరద బాధితులకు జెనీలియా విరాళం

Genelia

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర కర్ణాటక చిగురుటాకులా వణుకుతోంది. వరదల వల్ల 48 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 2,738 గ్రామాలు వరదల ప్రభావంతో నష్టపోయాయి. 40,523 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు సినీ ప్రముఖులు కూడా ముందుకొస్తున్నారు. తెలుగు హీరో సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ పరిశ్రమ నుంచి వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. మరోవైపు మహారాష్ట్రను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. హీరోయిన్ జెనీలియా ఈ వరద బాధితుల కోసం తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చింది జెనీలియా. భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి వచ్చి 25 లక్షలు విరాళం అందించింది ఈ మాజీ హీరోయిన్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తన విరాళాన్ని అందించింది ఈమె. అప్పట్లో రితేష్ దేశ్‌ముఖ్ తండ్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పని చేసారు. ఒకప్పుడు తెలుగు సినిమాలో వరస సినిమాలు చేసి సంచలనాలు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తను ప్రేమించిన రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న ఈమె త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి రానుందని తెలుస్తుంది.

Related posts

జెనీలియా ఇంట్లో .. బాలీవుడ్ సెలబ్రిటీల సందడి..

vimala p

బిగ్ బాస్-3 : అలీ రెజా రీఎంట్రీ ఖాయమైనట్టేనా ?

vimala p

సూర్య సినిమాలో మోహన్ బాబు కీలకపాత్ర

vimala p