telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రిషికుమార్ శుక్లా .. నేటి నుండి కొత్త సీబీఐ డైరెక్టర్ గా..

rishikumar shukla as new cbi director

సీబీఐ లో కూడా వివాదాలు ఏర్పడటం, అందులో కోర్టు కల్పించుకోవడం జరిగిన విషయం తెలిసిందే. దీనితో గత డైరెక్టర్ ను బాధ్యతల నుండి తప్పించారు. ఇప్పుడు కొత్త సీబీఐ డైరక్టర్‌గా రిషికుమార్ శుక్లా ను నియమించారు. ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ముందు ఓ సవాల్ నిలిచి ఉంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివాదాన్ని కొత్త డైరక్టర్ రిషికుమార్ ఎలా పరిష్కరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను వెంటనే నియమించాలని, ఇంతటి కీలక పోస్టులో రెగ్యులర్ డైరెక్టర్‌ను ఎందుకు నియమించలేదని కేంద్రాన్ని గత శుక్రవారం సుప్రీంకోర్టు నిలదీసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ రెండోసారి అత్యవసరంగా సమావేశమైంది. సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపికైన రిషి కుమార్ శుక్లా… మధ్యప్రదేశ్ క్యాడర్ నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి ఐపీఎస్ అధికారి. 58 ఏండ్ల శుక్లా 1983వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మధ్యప్రదేశ్ డీజీపీగా సుమారు రెండున్నర సంవత్సరాలు పనిచేశారు. లైంగిక దాడి ఘటనలపై వేగవంతంగా విచారణకు ఆదేశించేవారని ఆయనకు పేరుంది. దీనితో ఆ రాష్ట్రంలో అలాంటి నేరాలు గణనీయ స్థాయిలో తగ్గాయని అధికారులు తెలిపారు.

Related posts