telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

భారతీయ కుభేరుడు..అరుదైన ఘనత

భారత పారిశ్రామిక దిగ్గజం, ముఖేశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో టాప్‌లో దూసుకెళుతున్న ముకేష్ అంబానీ..సంపాదనలో వంద బిలియన్ డాలర్లకు చేరువయ్యారు. ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా, ఆసియలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛీఫ్ ముకేష్ అంబానీ మరో కీర్తి సాధించనున్నారు. ముకేష్ సంపాదన వంద బిలియన్ డాలర్లు అంటే పదివేల కోట్లకు చేరుకోబోతున్నారు.

ఈ సంపద ఇంతభారీగా పెరగడానికి కారణం ..ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రియలన్స్‌ షేర్‌ వ్యాల్యూ శుక్రవారం ఒక్క రోజే 4 శాతం పెరుగడంతో ఆస్థుల విలువ అమాంతంగా పెరిగింది. దీంతో ఒక్కరోజే అంబానీ ఆస్థుల నికర విలువ 3.71 బిలియన్ డాలర్లు డాలర్లకు పెరిగింది. ఈ ఏడాదిలో ముఖేష్ ఆస్థుల నికర విలువ 15.9 బిలియన్ డాలర్లు గా ఉంది .

బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ తన నికర ఆస్తుల విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ 103 బిలియన్‌ డాలర్లతో 10వ స్థానంలో నిలవగా.. 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్‌ సంస్థ లోరియల్‌ వారసురాలు బెటెన్‌కోర్ట్ మేయరన్‌ ఉన్నారు.

గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణలో తీసుకుంది.

లోకల్‌ సెర్చి ఇంజిన్‌ జస్ట్ డయల్‌లో ఆర్ఆర్ విఎల్‌కు 40.98 శాతం వాటా ఉంది. ప్రపంచంలో ఇప్పుడు 201 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉండగా..199 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ రెండవ స్థానంలో ఉన్నారు. బిల్‌గేట్స్, మార్గ్ జుకర్‌బర్గ్‌లు 4, 5 స్థానాల్లో ఉన్నారు.

Related posts