telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆస్తమా బాధితులు .. ఈ ఆహరం తీసుకోకుంటేనే మేలు..

right food for asthma patients

వైద్య నిపుణులు కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడమే ఆస్తమా బాధితులకు మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యానికి సహకరించని ఆ ఆహారపదార్థాల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆస్తమా ఉన్నవారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి.

* ఆస్తమా ఉన్నవారు మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, బీఫ్‌ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల శ్వాసకోస ఇబ్బందులు తలెత్తవచ్చు.

* సాఫ్ట్‌ డ్రింక్స్‌లో ఉండే కొన్నిరకాల పదార్థాలూ శ్వాసకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఆస్తమా బాధితులు ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్‌డ్రింక్స్‌ను తీసుకోకూడదు.

* కొన్నిరకాల పచ్చళ్లలో సల్ఫైట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది శ్వాసకి సమస్యగా మారుతుంది. ఆస్తమా ఉన్నవాళ్లు పచ్చళ్లు తినకూడదు.

* సోడియంకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, ప్యాక్‌ చేసిన ఆలూ చిప్స్‌లో సల్ఫైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినకూడదు.

* ఆస్తమా ఉన్నవారు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

* పచ్చి ఉల్లిపాయలు తీసుకోవచ్చు. అవి ఆస్తమాను కలిగించే ఇన్‌ఫ్లమేషన్లను తగ్గిస్తాయి.

* రోజూ క్రమం తప్పకుండా మూడు కప్పులకు మించకుండా కాఫీ తాగితే ఆస్తమా స్థాయిలు తగ్గే అవకాశం ఉంది.

* రెండు చెంచాల వెల్లుల్లి, అల్లం కలిపిన టీని రోజూ ఉదయం, సాయంత్రం తాగటం వల్ల ఆస్తమా వ్యాధి కంట్రోల్‌ అవుతుంది.

* రోజూ గ్లాసు వేడినీటిలో తేనెను కలుపుకొని, తాగటం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందుతారు. తులసి ఆకులు ఆస్తమాను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి.

* ఆస్తమా స్థాయిలు పెరిగితే తేనెను ముక్కు దగ్గర పెట్టుకొని, దాని వాసనను పీల్చుకోవాలి. కొన్ని మెంతి విత్తనాలను తీసుకొని, గ్లాసు నీటిలో కలిపి వేడిచేయాలి. ఈ మిశ్రమానికి తేనె, వెల్లుల్లి రసాలను కలిపి, రోజూ ఉదయాన్నే తాగితే ఉపశమనం లభిస్తుంది.

Related posts