telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఇండియన్ 2’ సినిమాలో తన పాత్రపై కమల్ మనస్తాపం…

indian

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇండియన్ 2. ఈ సీక్వెల్‌ను ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో తెలీదు గానీ అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు ఆటంకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతీయుడు 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదం మూవీ యూనిట్‌కు పెద్ద ఇబ్బందిని కలిగించింది. ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విషయంలో దర్శకుడు, నిర్మాతకు మధ్య మళ్లీ ఇబ్బందులు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్‌ 2లో బాబీ సింహా కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో కమల్ పాత్ర కంటే.. బాబీ సింహా కారెక్టర్‌నే ఎక్కువగా ఉందట. కమల్‌ను మించేలా బాబీ పాత్రను శంకర్ డిజైన్ చేశారట. ఈ విషయంలో కమల్, నిర్మాత మధ్య బేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాబీ పాత్ర విషయంలో కాస్త ఆలోచించమని శంకర్‌కు చెప్పారట నిర్మాత.

Related posts