telugu navyamedia
క్రీడలు వార్తలు

స్మిత్ పరుగుల ఆకలి మీద ఉన్నాడు : పాంటింగ్

గత సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమ్యాడు. అతని సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ గతేడాది 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇక 14 మ్యాచ్‌ల్లో 311 పరుగుల చేసిన స్మిత్‌ బ్యాట్స్‌మన్‌ గానూ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రూ.12.4 కోట్ల భారీ ధరకు తీసుకున్న రాజస్థాన్ స్మిత్‌పై వేటు వేసింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌ను తమ నూతన సారథిగా నియమించింది. దాంతో ఈ సీజన్ వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌ను ఆశ్చర్యకరంగా ఢిల్లీ క్యాపిటల్స్ అతని కనీస ధర రూ.2 కోట్లకు మరో 20 లక్షలు ఎక్కువగా చెల్లించి సొంతం చేసుకుంది. అతని కోసం ఆరంభంలో ఆర్‌సీబీ పోటి పడినా చివర్లో తప్పుకుంది. దాంతో స్మిత్ తక్కువ ధరకే ఢిల్లీకి సొంతమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ… తుది జట్టులో అతను టాప్-3లో ఆడుతాడని, అయితే టీమ్ కాంబినేషన్స్ బట్టి అతనికి తుది జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోవచ్చన్నాడు పాంటింగ్.

Related posts