telugu navyamedia
telugu cinema news trending

నా పేరును అవమానకర రీతిలో వాడారు… హీరోయిన్ ఫైర్

richa chadda

బాలీవుడ్‌ నటి పాయల్ ఘోష్ ‌సినిమా అవకాశాల కోసం వెళ్లిన తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ గదిలోకి తీసుకెళ్లి బ్లూఫిలిమ్ చూపించి లైంగిక వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడితో కొందరు హీరోయిన్లు పడక సుఖం పంచుకున్నారంటూ పేర్లు వెల్లడించింది. ఇందులో ప్రముఖ నటి రిచా చద్దా పేరు కూడా ఉండటంతో ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని వివాదంలోకి తన పేరు వాడి పరువుకు భంగం కలిగించే వారిని వదిలి పెట్టనని రిచా అంటోంది. తన పేరును వివాదంలోకి లాగిన పాయల్ ఘోష్‌పై చర్యలు తీసుకోవాలని రిచా నిర్ణయించుకున్నట్లు ఆమె తరుపు లాయర్ సోమవారం తెలిపారు. “అనురాగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడో వ్యక్తి నా క్లైయింట్‌ రిచా చద్దా పేరును అనవసరంగా తీసుకువచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటిది ఆమె పేరును అవమానకర రీతిలో వాడారు. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతరులను అనవసరంగా వివాదంలోకి లాగి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడే మహిళకు మరొక మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు లేదు. దీన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం” అని రిచా తరపు లాయర్ అన్నారు.

Related posts

నీకు ఓ రిటర్న్‌ గిఫ్ట్‌ రుణపడి ఉన్నా… ఎన్టీఆర్ కు చరణ్ ట్వీట్

vimala p

హీరోయిన్ మాల్వి మల్‌హో‌త్రాపై కత్తితో దాడి

vimala p

విద్యా శాఖలోనూ .. మార్పులకు శ్రీకారం..

vimala p