telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సూపర్ మచ్చి” సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ రియా చక్రవర్తి… కానీ…!!

kalyandev with supermachi movie

కళ్యాణ్ దేవ్ హీరోగా పులివాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. గ్యాప్ లేకుండా కళ్యాణ్ దేవ్ షూటింగ్ లో పాల్గొంటునాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కళ్యాణ్ దేవ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముందుగా ‘సూపర్ మచ్చి’ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని తీసుకున్నారని తెలిపారు. అయితే సుశాంత్‌తో తనకు సినిమా ఉందంటూ ఆమె మధ్యలోనే వెళ్లిపోయిందని తెలిపాడు. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకుని రీషూట్ చేసినట్టు కళ్యాణ్ తెలిపారు. ‘సూపర్ మచ్చి’ సినిమాలో బార్ లో పని చేసే సింగర్ గా కళ్యాణ్ దేవ్ నటిస్తున్నారు. ఇంకా ఒక సాంగ్ రెండు రోజుల టాకీ పార్టు షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్నారు. ఈ కరోనా సమయంలో ధైర్యంగా షూటింగ్ లో పాల్గొనడానికి తన సినిమా నిర్మాతలు ముఖ్య కారణమన్నారు కళ్యాణ్. వారికి ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని భావించానన్నారు. షూటింగ్‌లో పాల్గొనడంతో తాను ప్రస్తుతం తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక రియా చక్రవర్తి ‘తూనీగా తూనీగా’ తెలుగు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Related posts