telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియాకు బెయిల్ ఇవ్వకపోవడానికి అసలు కారణం ఇదే…!

Rhea

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ముంబై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రియాకు బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో రియా కొందరి పేర్లను వెల్లడించిందని, రియా బయటపెట్టిన వారిని విచారించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రియా విడుదలైతే అందరూ కలిసి సాక్ష్యాలను నాశనం చేస్తారని, సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఇప్పుడు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితురాలికి తాను బెయిల్ ఇవ్వలేనని జడ్జి తెలిపారు. విచారణ సందర్భంగా రియా తరపు లాయర్ వాదిస్తూ… ఆమె వద్ద కొంత మొత్తంలో గంజాయి మాత్రమే ఉందని… బెయిల్ పొందడానికి ఆమె అర్హురాలని వాదించారు. ఈ వాదనను జడ్జి ఖండించారు. ప్రాసిక్యూషన్ ఆరోపణల ప్రకారం డ్రగ్ ట్రాఫికింగ్ లో రియా ఉందని చెప్పారు. సుశాంత్ డ్రగ్స్ కు రియా డబ్బు చెల్లించిందని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం ఇది నాన్ బెయిలబుల్ అని… సెక్షన్ 27-ఏ కింద ఆమె శిక్షార్హురాలని స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 27-ఏ కింద ఎవరైనా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ డ్రగ్స్ ఫైనాన్సింగ్ లో ఉన్నట్టైతే వారికి 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇదే సమయంలో రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

Related posts