telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు

KRKR

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తనను కించపరిచేలా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్ ఉందని, ఆ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని ప్రశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇది వరకే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇంద్రసేనా చౌదరి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారని, సినిమా విడుదల అయితే కమ్మ, రెడ్డి కులస్తుల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని, కావున వెంటనే విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వదేరా కోర్టుకు విన్నవించారు. పిటిషన్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై రేపు విచారణ జగనుంది.

Related posts