telugu navyamedia
telugu cinema news trending

మర్డర్ : ఆర్జీవికి కరోనా… విచారణకు డుమ్మా

RGV

తన అనుమతి లేకుండా తన జీవిత కథపై రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే సినిమాను తీస్తున్నారని పలు ఆరోపణలు చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 11 లోగా నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న నట్టి కరుణ కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని వర్మ న్యాయవాదిని కోర్టు అడగగా.. తన క్లయింట్‌కు కరోనా సోకిందని, అందువల్ల పిటిషన్‌కు జవాబు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. దీంతో అమృత వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 14కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. మరి ఆరోజైనా వర్మ కోర్టుకు వస్తారో లేదో చూడాలి. ‘మర్డర్’ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వర్మ పర్యవేక్షిస్తున్నారు. అలాగే, చిత్ర నిర్మాణంలో ఆయనకి భాగముంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. కాగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ తనకు కరోనా సోకిందన్న వార్తలను ఖండిస్తూ వీడియో విడుదల చేయడం గమనార్హం.

Related posts

వాల్మీకి : శోభన్ బాబు, శ్రీదేవిల పాపులర్ పాట రీమిక్స్

vimala p

ఫిబ్రవరి 28న ‘కనులు కనులను దోచాయంటే’

vimala p

ముచ్చటగా మూడోసారి శ్రియ, వెంకటేష్ కాంబినేషన్

vimala p