telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“టీచర్స్ డే”ని విస్కీతో ముడిపెడుతూ… ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

Ram-Gopal-Varma

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తే… మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ఈ చిత్రం నుంచి రెండు పాటలను విడుదల చేశారు. తాజాగా “టీచర్స్ డే” సందర్భంగా రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. “టీచర్స్‌ డేని.. ‘టీచర్స్ విస్కీ’తో టీచర్లు సెలబ్రేట్ చేసుకుంటారా?” అని వ్యాఖ్యానించారు. “నా టీచర్స్ అంతా నన్నో మంచి విద్యార్థిగా, మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా మార్చడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి టీచర్స్ డే గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు. నేను ఒకవేళ బ్యాడ్ స్టూడెంట్ అయినప్పటికీ.. నన్ను గుడ్ స్టూడెంట్‌గా మార్చడం మంచి టీచర్ విధి కాదా? ఎప్పుడైతే నన్ను మంచి విద్యార్థిగా మార్చడంలో వారు ఫెయిల్ అయ్యారో అప్పుడే వారు బ్యాడ్ టీచర్స్‌గా నిరూపించబడ్డారు. టీచర్స్ డేని ‘టీచర్స్ విస్కీ’తో టీచర్స్ సెలబ్రేట్ చేసుకుంటారా? జస్ట్ ఆస్కింగ్!” అని రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

Related posts