telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణకు నాగబాబు కౌంటర్… స్పందించిన వర్మ

RGV

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని చేసిన కామెంట్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. నాగబాబు, బాలయ్యను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఆ తరువాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు అలా 5 వీడియోలను విడుదల చేసి బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు నాగబాబు. చివరగా మరో వీడియోను విడుదల చేసి ఈ వివాదాన్ని ఆపేస్తానని స్పష్టం చేశారు. అయితే నాగబాబు, బాలకృష్ణ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

“కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌ని నా బాధ ఒక‌వైపు… త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను స‌మ‌ర్థించ‌డంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌న్న ఆనందం మరోవైపు… ఒక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు. నాగ‌బాబుగారూ హ్యాట్సాఫ్‌… మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు.

Related posts