సినిమా వార్తలు

'గాడ్ సెక్స్ ట్రూత్' కాపీ కథా..?

అమెరికా పోర్న్ స్టార్ మియా మల్కోవాతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ ట్రూత్ కథ కాపీ అంటూ ఆర్జీవీ మాజీ అసిస్టెంట్ వార్తల్లోకి ఎక్కడం సంచలనంగా మారింది. ఆర్జీవీతో కలిసి సర్కార్ 3 చిత్రానికి పనిచేసిన పి.జయకుమార్ అనే వ్యక్తి రాసిన ‘గాడ్ – సెక్స్ – ట్రూత్’ కథను ఆర్జీవీ రివ్యూ కోసం పంపితే అతడు తన అనుమతి లేకుండా చిత్రాన్ని తెరకెక్కించేసాడని జయకుమార్ ఆరోపించారు.

తన కథని అచ్చు గుద్ది నట్లు ఆర్జీవీ తీశాడని.. ఏ మాత్రం మార్పులు లేకుండా, తన డైలాగులతో సహా ఈ వీడియోను ఆర్జీవీ తెరకెక్కించాడని జయకుమార్ మీడియా ద్వారా తెలిపాడు. అతడు రాసిన గాడ్ సెక్స్ ట్రుథ్ అనే కథ పీడీఎఫ్ ఫైల్ ను అంతర్జాలంలో విడుదల చేశాడు. ఆర్జీవీ విడుదల చేసిన ట్రైలర్ చూసి షాక్ అయ్యానని.. ఈ విషయం పై కోర్టుకు వెళ్తానని జయకుమార్ స్పష్టం చేశాడు. మరి ఈ విషయం పై ఆర్జీవీ ఏ రకంగా స్పందిస్తాడో చూడాలి.

Related posts

విజయ్ 'నోటా' ..?

admin

బిగ్ బాస్ 2 హౌస్ లో విషాదం…

jithu j

నిక్ జోనాస్ మాజీ ప్రియురాలి వ్యాఖ్యలు…. షాక్ లో ప్రియాంక చోప్రా

nagaraj chanti

Leave a Comment