telugu navyamedia
సినిమా వార్తలు

కాళ్ళు పట్టుకున్నాడన్న కేఏ పాల్… ప్రభువా అంటున్న వర్మ

RGV Counter to KA Paul

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేఏ పాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విడుదల చేశారు. గతంలో కేఏ పాల్ పై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రామ్ గోపాల్ వర్మ తన కాళ్ళు పట్టుకున్నారని ట్వీట్ చేశారు. “వావ్… ఆర్జీవీ ముంబై హోటల్‌ లో నన్ను కలిసి నా పాదాలకు నమస్కారం చేశారు. తన గురువు దాసరిగారి కాళ్లను కూడా తానెప్పుడూ అలా పట్టుకోలేదని చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉండి ఇది చూసిన జ్యోతి, వెంకట్ షాక్ అయ్యారు. నన్ను నా ఏపీ ప్రజలు నాలుగు నెలల్లో సీఎంని చేస్తారు. ఆ వెంటనే మేము ప్రపంచంలోనే ది బెస్ట్ అని అనిపించుకుంటాం. ఆ తరువాత దేశం గురించి చూస్తాం” అని కేఏ పాల్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన వర్మ స్పందిస్తూ “ప్రభువా..! నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగితే వెనక్కి పడి, తల నేలకు తగిలి, బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా. కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేశా” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Related posts