telugu navyamedia
andhra news political

పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ

RGV

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా భీమవరంలో రూ. 150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలపై వర్మ ఘాటుగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆర్జీవీ ట్వీట్ చేశారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనని అన్నారు. పవన్ కల్యాణ్‌ను నిజంగా గెలిపించాలనుకుంటే ఓటర్లు అతనికే ఓటు వేశేవారని తెలిపారు. పవన్ వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయంటూ వర్మ కౌంటరిచ్చారు.

ఇక ఆర్జీవీ ట్విట్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు, కార్యకర్తలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జనసేన పార్టీని ఒక్క ఓటమి ఆపలేదని, పరాజయాన్ని అంగీకరించిన తాను గెలిచేవరకు పోరాటం చేస్తునే ఉంటానని పవన్ అన్నారు. తన జీవితం రాజకీయాలకే అంకితమని, తనను నలుగురు మోసుకెళ్లేవరకు జనసేనను మోస్తానని ఆయన స్పష్టం చేశారు.

Related posts

ఏపీఎస్ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్

vimala p

ఇప్పుడు తెలివిలోకి వచ్చాడు.. పవన్ పై విజయసాయి విమర్శలు

vimala p

తలసానిని గల్లీల్లో తరిమికొట్టే రోజులస్తాయి: ఎంపీ బండి సంజయ్‌

vimala p